వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.... రెడీ టు షూట్

Sunday,May 19,2019 - 09:20 by Z_CLU

సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమా షూటింగ్ ఈ నెల 25 నుండి మొదలు కానుంది. కాకినాడలో దాదాపు 20 రోజుల పాటు మొదటి షెడ్యుల్ జరగనుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.

 ఈ సినిమాకు ముందుగా మనిషా రాజ్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ ప్లేస్ లో కృతి శెట్టిని అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు.

మాస్ ఎలిమెంట్స్ తో రష్టిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జాలరిగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.