వాలెంటైన్స్ డే స్పెషల్ గా 'ఉప్పెన' !

Wednesday,January 27,2021 - 12:17 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా రిలీజ్ వరకు వచ్చి కొన్ని నెలలు వాయిదా పడిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. వాలెంటైన్స్ డే స్పెషల్ గా సినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

Uppena-Release-date-locked-zeecinemalu

 ఆల్బం నుండి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ లో మంచి స్థానం అందుకొని మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ సాంగ్స్ అయిపోయాయి. టీజర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. త్వరలోనే నాలుగో పాటతో రిలీజ్ ట్రైలర్  రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ , రవి శంకర్ , సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. మరి వాలెంటైన్స్ వీక్ లో ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.