Vaishnav Tej మూడో సినిమా ఫిక్స్ ?

Wednesday,February 17,2021 - 01:40 by Z_CLU

మొదటి సినిమా ‘ఉప్పెన’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ క్రిష్ తో రెండో సినిమా పూర్తి చేసేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తాజాగా మూడో సినిమా కూడా కన్ఫర్మ్ చేసేసుకొని త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడట. అవును మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో నాగార్జున నిర్మాణంలో చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం అవ్వనున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా గురించి అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ త్వరలోనే అఫీషియల్ గా వైష్ణవ్ తేజ్ తో సినిమా అంటూ ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. తొలి సినిమా  ‘ఉప్పెన’ గ్రాండ్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న వైష్ణవ్ తేజ్ చేతిలో ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ తో పాటు మరికొన్ని బేనర్స్ నుండి సినిమా కోసం అడ్వాన్సులు వెళ్లాయట. ఈ వరుస ఆఫర్స్ తో  మెగా యంగ్ హీరో కెరీర్ సక్సెస్ ఫుల్ గా వెళ్ళడం ఖాయమనిపిస్తుంది.