Vaishnav Tej's రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న'రంగరంగ వైభవంగా'

Wednesday,March 30,2022 - 06:41 by Z_CLU

‘ఉప్పెన’ సినిమాతో  బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న వైష్ణ‌వ్ తేజ్ హీరోగా  గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 1 ఈ సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా కేతికా శ‌ర్మ హీరోయిన్‌ నటిస్తుంది. ఇటీవలే విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌ ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ అందుకున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.