స్టార్ డైరెక్టర్ తో రెండో సినిమా!

Friday,August 14,2020 - 01:08 by Z_CLU

టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. విభిన్న కథలను ఎంచుకుంటూ సినీ ప్రయాణం చేస్తూ దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఓ యంగ్ హీరోతో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అవును… ‘ఉప్పెన’ తో హీరోగా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు క్రిష్.

ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్ మెంట్స్ పై సాయి బాబా జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో తక్కువ మంది క్రూ, ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేయడం కష్టం అని భావించి ఆ షూట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ లోపు పవన్ హరీష్ శంకర్ తో సినిమా కంప్లీట్ చేస్తారనే టాక్ ఉంది.

మరి అదే నిజమైతే క్రిష్ పవన్ సినిమా గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ సినిమాను ఫినిష్ చేయడం ఖాయం. అసలే పెద్ద సినిమాలను కూడా తక్కువ షూటింగ్ డేస్ లో కంప్లీట్ చేసే క్రిష్ కి ఈ చిన్న సినిమా ఫినిష్ చేయడం చాలా ఏజీ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ కాంబో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.