Interview - వైష్ణవ్ తేజ్ (రంగ రంగ వైభవంగా)

Thursday,September 01,2022 - 05:55 by Z_CLU

‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు వైష్ణవ్ తేజ్. గిరీశాయ దర్శకత్వంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపే విడుదలవుతుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు వైష్ణవ్ మాటల్లోనే…

రంగ రంగ … యూత్ ఫుల్ గా

సినిమాలో నేను 4th ఇయర్ MBBS స్టూడెంట్ గా కనిపిస్తాను. సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ , రొమాంటిక్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. యూత్ ఫుల్ గా ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే సినిమా అవుతుంది.

ఆ స్థాయి నాకు లేదు

టీజర్ లో నేను పవన్ మావయ్య ని ఇమిటేట్ చేశానని అది చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. కానీ నిజానికి మేము అది అనుకోని చేయలేదు. సుబ్బరాజు తో ఉండే ఓ సన్నివేశంలో నేను సిగ్గు పడాలి. అనుకోకుండా అలా వచ్చేసింది. ఆ సీన్ అప్పుడు నేను వెళ్లి మానిటర్ కూడా చూడలేదు. తర్వాత మా డైరెక్టర్ చెప్పాడు అది పవన్ కళ్యాణ్ గారిని గుర్తుచేసేలా ఉందని. సో ఆయన్ని ఇమిటేట్ చేసే స్థాయి నాకు లేదు.

ఇలాంటి కథ వచ్చి చాలా రోజులైంది.

ఈ కథ వినగానే బాగుంది. ఇలాంటి కథ వచ్చి చాలా రోజులైంది అనిపించింది.  లవ్ తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉండే ఇలాంటి కథలు కాస్త అరుదుగా వస్తుంటాయి. ఒక ఆడియన్ లానే నెరేషన్ విన్నాను. కథ వినే టప్పుడు నవ్వుకున్నాను ఎంజాయ్ చేశాను. అందుకే కనెక్ట్ అయ్యాను.

ఆ ఫీలింగ్ వచ్చింది 

చాలా కథలు విన్నాను. కానీ ఈ కథకి కనెక్ట్ అవ్వడానికి రీజన్ కంటెంట్. ఒక మంచి బ్యూటిఫుల్ ఫిలిం అవుతుందనిపించింది. బోర్ కొట్టకుండా సరదాగా ఉందనిపించింది. జెన్యూన్ ఫీలింగ్ కలిగింది.

సినిమాలో  అన్నీ ఉన్నాయి

ఈ సినిమాలో థియేటర్స్ లో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. మంచి లవ్ ట్రాక్ , ఎంటర్టైన్ మెంట్ , బ్యూటిఫుల్ సాంగ్స్ , ఫ్యామిలీ  డ్రామా , ఎమోషన్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మా ఇద్దరి ఇగో తో ఆడియన్ కి మంచి ఫన్ ఉంటుంది. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సరదాగా  ఉంటుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.

అందరి దగ్గర నేర్చుకున్నా 

ఈ సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో పనిచేశాను. కొండపొలం లో కూడా కొందరు సీనియర్స్ తో వర్క్ చేశాను కానీ ఇందులో ఇంకా ఎక్కువ మందితో నటించాను. నరేష్ గారు , ప్రభు గారు , ప్రగతి గారు ,తులసి గారు ఇలా చాలా మందితో వర్క్ చేశాను. వారందరి దగ్గర చాలా నేర్చుకున్నాను. నవీన్ చంద్ర గారు కూడా ఓ స్పెషల్ రోల్ చేశారు.  అనుభవంతో నటించే విధానాన్ని పరిశీలించే వాడ్ని. సెట్ బయట పేరు మరోలా ఉంటారు షాట్ రెడీ అనగానే ఒక్కసారిగా మారిపోతారు. అలాంటివి బాగా అబ్సర్వ్ చేశాను.

లెర్నింగ్ యాక్టర్ 

నేను లెర్నింగ్ యాక్టర్. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. అందరినీ ఎంటర్తైన్ చేస్తూ ఒక్కో సినిమా చేసుకుంటూ ప్రతీ సినిమా నుండి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ముందుకెళ్తాను.

మా ఇద్దరి మధ్య బాండింగ్ అలానే ఉంటుంది

అన్నయ్య తేజ్ కి నాకు మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది. మేమిద్దరం అలాగే ఉంటాం. అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసింది కాదు. బేసిక్ మేం అలానే ఉంటాం. అన్నయ్య నన్ను ఆటపట్టిస్తూనే ఉంటాడు.  అన్నయ్యే కాదు ఇంట్లో అందరూ నాతో సరదాగా ఆట పట్టిస్తూ క్లోజ్ గా ఉంటారు.

 రీమేక్స్ టచ్ చేయను ..కానీ !

పెద్ద మావయ్య , చిన్న మావయ్య సినిమాలు రీమేక్ చేయను. వాళ్ళు చేస్తేనే బాగుంటది. ఆ సినిమాలు చూస్తూ పెరిగాను వాటిని అస్సలు టచ్ చేయను. కానీ ఒకవేళ  ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది నువ్వే చెయ్యాలి అంటే మాత్రం బద్రి సినిమాను రీమేక్ చేయాలని ఉంది.

నెక్స్ట్ ఆ సినిమానే 

సితార ఎంటర్తైన్ మెంట్స్ బేనర్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను. శ్రీకాంత్ రెడ్డి ఆ సినిమాకు దర్శకుడు. ఆ ఫిలింతో తను డెబ్యూ చేస్తున్నాడు. ఆ సినిమా యాక్షన్ మాస్  కమర్షియల్ సినిమాగా ఉండబోతుంది.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics