వైష్ణవ తేజ్ డెబ్యూ మూవీ.....రిలీజ్ డేట్ ఫిక్స్

Sunday,November 04,2018 - 04:20 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే… మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా  గురించి లేటెస్ట్ గా ఓ అప్ డేట్ బయటికొచ్చింది.

డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా  రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ వరకూ టోటల్ షూటింగ్ ఫినిష్ చేసి మే 7 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తన డెబ్యూ సినిమా ‘ఆర్య’ రిలీజ్ డేట్ కావడంతో ఇప్పుడు శిష్యుడి సినిమా కూడా అదే డేట్ కి రిలీజ్ అవ్వాలని  భావిస్తున్నాడట సుకుమార్.