శివుడి అనుగ్రహంతోనే వైశాఖం

Thursday,February 23,2017 - 06:45 by Z_CLU

హరీష్, అవంతిక జంటగా తెరకెక్కుతున్న ‘వైశాఖం’ సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది. శివుని సన్నిధానంలో బిగిన్ అయిన సినిమా యూనిట్ , సరిగా శివరాత్రి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంది సినిమా యూనిట్.

గతంలో లవ్లీ, ప్రేమలో పావని కళ్యాణ్, లవ్లీ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ B. జయ, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. యూత్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు సినిమా యూనిట్. D.J. వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని B.A. రాజు నిర్మించారు.