కొత్త బ్యానర్ లో ఫస్ట్ రీమేక్

Friday,October 13,2017 - 07:06 by Z_CLU

వి-4 మూవీస్.. ఓ మంచి ఉద్దేశంతో పెట్టిన బ్యానర్. కొత్త టాలెంట్ ను, సరికొత్త కథల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ. గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్, స్టుడియో గ్రీన్ సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన వి4 మూవీస్ బ్యానర్ కు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్యానర్ పై తెరకెక్కిన ఫస్ట్ వెంచర్ ‘నెక్ట్స్ నువ్వే’.

ఓ మంచి కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో కన్నడంలో హిట్ అయిన సూపర్ హిట్ హారర్-కామెడీని తెలుగులో రీమేక్ చేశారు. 2014లో వచ్చిన ‘యామిరుక్క బయమే’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ‘నెక్ట్స్ నువ్వే’.

ఆది సాయికుమార్, వైభవి, రష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, హిమజ కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రామిసింగ్ గా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ తో ఇప్పటికే పక్కా అయింది. నవంబర్ 3న విడుదలకానున్న ఈ సినిమా వి-4 మూవీస్ బ్యానర్ కు సక్సెస్ తో పాటు ప్రాఫిట్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది జీ సినిమాలు.