V మూవీ అప్ డేట్స్

Tuesday,November 05,2019 - 12:58 by Z_CLU

నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న సినిమా V. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. సినిమాకు సంబంధించి 80శాతం షూటింగ్ పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. రెండు ఫైట్స్, ఒక సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపింది.

సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మార్చి 25న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. సమ్మర్ బరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మొదటి సినిమా ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ ఇస్తున్నాడు.

గతంలో యాక్షన్-థ్రిల్లర్ జానర్ లో జెంటిల్ మేన్ సినిమా చేశాడు ఇంద్రగంటి. ఇప్పుడు దాదాపు అదే జానర్ లో V సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం దాదాపు 7 నెలలు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాడు. అందుకే మూవీపై అంచనాలు పెరిగాయి.