కరోనా ఎఫెక్ట్.. V మూవీ వాయిదా

Saturday,March 14,2020 - 01:49 by Z_CLU

నాని, సుధీర్ బాబు కలిసి నటించిన V సినిమా వాయిదా పడింది. ఈ మేరకు యూనిట్ నుంచి అఫీషియల్ నోట్ బయటకొచ్చింది. లెక్కప్రకారం ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలి. కానీ ఇప్పుడు ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది V మూవీ. దిల్ రాజు బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో అదితిరావు, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాన్నాళ్ల కిందటే ఈ సినిమాను రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఊహించని విధంగా కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించడంతో మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.

ఏప్రిల్ లో ఏ తేదీకి సినిమాను విడుదల చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. సుధీర్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని, నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.