V.I. ఆనంద్ ఇంటర్వ్యూ

Thursday,January 23,2020 - 10:04 by Z_CLU

కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల దర్శకుడు అనిపించుకుంటున్న V.I. ఆనంద్ ‘డిస్కోరాజా’ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. స్టోరీలైన్ ఇప్పటిది కాదు దాదాపు పదేళ్ళ క్రితమే నాకీ ఆలోచన వచ్చింది. కానీ రీసెంట్ గా బయో కెమికల్ రీసర్చ్ బ్యాక్ డ్రాప్ లో చదివిన ఒక ఆర్టికల్, ఈ కథని కంప్లీట్ చేయడానికి ఇన్స్ పైర్ చేసింది అని చెప్పుకున్నాడు. ‘డిస్కోరాజా’ కి సంబంధించి జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో… ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

అదీ డిస్కోరాజా…

డిస్కోరాజా సినిమా… ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఒక ఆర్టికల్ లో బయో కెమికల్ బేస్డ్ రీసర్చ్ గురించి చదివాను. ఒకవేళ ఆ రీసర్చ్ గనక నిజమైతే ఎలా ఉంటుంది…? అని ఆలోచిస్తే డిస్కోరాజా సినిమా. ఆ రీసర్చ్ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

కరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ…

టైగర్, ఎక్కడికి పోతావు, ఒక్కక్షణం తో కంపేర్ చేస్తే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా నా కరియర్ ని డెఫ్ఫినెట్ గా ఇంకో మెట్టు ఎక్కిస్తుంది.

ఐస్ లాండ్ స్టోరీస్…

ఐస్ లాండ్ లో షూటింగ్ చేసినప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టీమ్  ఈ సినిమాకి పని చేసింది .చాలా చాలెంజింగ్ పరిస్థితుల్లో సినిమాని తెరకెక్కించాము.  మార్నింగ్ మంచు 0 డిగ్రీస్… ఉంటే సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికీ ఆ మంచు కరిగి చిన్న చిన్న గుంటలు పడి ఉంటుంది. అక్కడ ట్రావెల్ చేయడానికి స్పెషల్ వెహికిల్స్ ఉంటాయి. వాటిలో ట్రావెల్ చేశాం. ఆ సీక్వెన్సెస్ బిగ్ స్క్రీన్ పై అమేజింగ్ అనిపిస్తుంది. ఇంటర్ స్టెల్లార్ సినిమాలో ఇంకో ప్లానెట్ లా చూపించిన లొకేషన్ అదీ. సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ని ఇక్కడ షూట్ చేశాం.

రాసినప్పుడే రవితేజ…

డిస్కోరాజా క్యారెక్టర్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఒక డిస్కో లవింగ్ గ్యాంగ్ స్టర్… హీరోయిజం, వెటకారం,  స్వాగ్ అన్నీ కలిసిన క్యారెక్టర్.. అందుకే రాసేటప్పుడే ఈ క్యారెక్టర్ రవితేజ గారే అనుకున్నా.. ఇంకో ఆప్షన్ మైండ్ కి తట్టలేదు. ఆ 1980 సీక్వెన్సెస్ అయినా ప్రెజెంట్ సీక్వెన్సెస్ అయినా ఆయన ఉంటేనే పాసిబుల్ అవుతుందని నాకు తెలుసు…

అదీ రవితేజ…

రవితేజ గారు బేసిగ్గా డిస్కో లవర్. కథ చెప్పడానికి ముందు నాక్కూడా ఆ విషయం తెలీదు… ‘అయాం ఎ డిస్కో డ్యాన్సర్..’ అనే బాలీవుడ్ సాంగ్ ఆయనకు ఇప్పటికీ ఇష్టమే. సినిమాలో క్యారెక్టర్ కి కూడా డిస్కో డ్యాన్స్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రవితేజ గారి లాగే సినిమాలో క్యారెక్టర్ కి కూడా అమితాబ్ బచ్చన్ కి పెద్ద ఫ్యాన్.

కాన్సెప్ట్ Vs కమర్షియల్

కాన్సెప్ట్ సినిమాలను కూడా కమర్షియల్ గా ప్రెజెంట్ చేయొచ్చు. అలా చూస్తే హాలీవుడ్ చాలా సినిమాలు ఈ ఫార్మాట్ ని సక్సెస్ ఫుల్ గా ప్రెజెంట్ చేశాయి. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. కాన్సెప్ట్ కథల్ని కమర్షియల్ గా ప్రెజెంట్ చేయగలిగితే ఎంత పెద్ద హీరోతో అయినా సినిమా చేయొచ్చు…

బాబీసింహా గురించి…

బాబీ సింహా ‘బర్మాసేతు’ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. చెన్నైలో ఉండే ఒక గ్యాంగ్ స్టర్ .‘జిగర్తాండ’ సినిమాలోలాగా ఈ క్యారెక్టర్ కూడా ఆయన కరియర్ లో నోటెడ్ క్యారెక్టర్ అవుతుంది.

హీరోయిన్స్.. కమెడియన్స్…

నభా నతేష్ ఢిల్లీ లో బ్యాంక్ లో పని చేసే అమ్మాయి. తాన్యా హోప్ సైంటిస్ట్ రోల్ లో కనిపించబోతుంది. పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ స్పెషల్ గా ఉండబోతుంది. ఇప్పటివరకు పాయల్ ని అలాంటి క్యారెక్టర్ లో చూసి ఉండరు. రెట్రో గెటప్ లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంది. సీనియర్ నరేష్ గారు వెన్నెల కిషోర్, సత్య, సునీల్ గారు కామెడీ చాలా బాగా చేశారు. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.

ఎక్స్ పెక్ట్ చేసిన ప్రతీది…

రవితేజ గారి సినిమా అనగానే ఆడియెన్స్ ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. కామెడీ దగ్గరి నుండి యాక్షన్ వరకు డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది. మాసిజం, హీరో ఎలివేషన్స్ అన్నీ..

‘ఒక్కక్షణం’ విషయంలో బాధ లేదు…

‘ఒక్కక్షణం’ సినిమా ఎందుకు కలెక్షన్స్ రాలేదనేది మాక్కూడా అర్థం కాలేదు. నాకైతే అందరి నుండి మంచి అప్రీసియేషన్ వచ్చింది. రిలీజ్ డేట్ రాంగేమో అని నా ఫీలింగ్.

నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లోనే…

‘ఒక్కక్షణం’ తరవాత ఇమ్మీడియట్ గా గీతా ఆర్ట్స్ లోనే చేయాలి కాకపోతే SRT వాళ్లకి ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. అందునా రవితేజ గారు యస్ అన్నారు కాబట్టి, పర్మిషన్ తీసుకుని ఈ సినిమా చేశాను. ఇప్పుడు పక్కా గీతా ఆర్ట్స్ లోనే. ఎలాంటి కథ, ఎవరు హీరో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు.

డిస్కోరాజా సీక్వెల్…

సీక్వెల్ కి లైన్ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. రవితేజ గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. కాకపోతే ఆయన కమిట్ మెంట్స్, నా కమిట్ మెంట్స్ తరవాత ఈ సీక్వెల్ ఉంటుంది.