ప్లాన్ మార్చిన ఉయ్యాలవాడ..?

Tuesday,July 11,2017 - 06:06 by Z_CLU

మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ సినిమాని మెగాస్టార్ బర్త్ డే రోజు ఆగష్టు 22 న లాంచ్ చేయాలని ఆల్ రెడీ ఫిక్సయింది సినిమా యూనిట్. అయితే సడెన్ గా ఈ సినిమా ఆగష్టు 22 న కాకుండా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఆగష్టు 15 న లాంచ్  చేయబోతున్నారనే న్యూస్ టాలీవుడ్ లో చిన్న సైజు వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది.

ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఆగష్టు 15 న రిలీజ్ చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోని ఉయ్యాలవాడ టీమ్, మెగాస్టార్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి ఫారిన్ టూర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చాకే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే చాన్సెస్ ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.