Radheshyam అందుకోసమే భారీ బడ్జెట్ !

Sunday,March 06,2022 - 10:02 by Z_CLU

UV Producers spend above 200cr for ‘Radheshyam’

ప్రభాస్ , పూజ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ కి సంబంధించి ఆడియన్స్ లో ఓ చర్చ నడుస్తుంది. అవును ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా వదులుతున్న కంటెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుండు. టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ఏ కంటెంట్ చూసినా అందులో హై బడ్జెట్ కనిపిస్తుంది. నిజానికి ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం ఎవరూ చేయని సాహసం చేశారు యూవీ క్రియేషన్స్. అదే ఇప్పుడు ఈ నిర్మాతలు వంశీ- ప్రమోద్, విక్కీల గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేస్తోంది.

నిజానికి రాధే శ్యామ్ సినిమాను ముందుగా ఇండియాలోనే తీయలనుకున్నారు. కానీ కథ వినగానే దీన్ని యూరప్ కంట్రీలో చెప్తే ఎలా ఉంటుందని ఓ ఐడియా ఇచ్చాడు ప్రభాస్. హీరో అలా అన్నాడో లేదో వెంటనే మేకర్స్ ప్లాన్ మొత్తం మార్చేసి యూరప్ బ్యాక్ డ్రాప్ లోనే కథను చెప్పడానికి రెడీ అయ్యారు. అక్కడి నుండి మేకర్స్ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెడుతూ సినిమా క్వాలిటీతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.

ఇక మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం , టీంలో కొందరికి సోకడం, ఇటలీ నుండి ఉన్నపళంగా ఇండియాకి రావడానికి ఎక్కువ ఖర్చే అయింది. అలాగే హైదరాబాద్ లో యూరప్ సెట్ వేసి భారీ ఎపిసోడ్స్ షూట్ చేశారు. ముఖ్యంగా షిప్ ఎపిసోడ్ కోసం భారీ ఖర్చు పెట్టారు.  ఇదంతా చూస్తే యూవీ ‘రాధే శ్యామ్’ విషయంలో  తగ్గేదే లే అంటూ వ్యవహరించినట్టు అనిపిస్తుంది. తాజాగా ప్రభాస్ ని ఓ విలేఖరి సినిమాలో డెస్టినీ గెలుస్తుందా ? ప్రేమ గెలుస్తుందా ? అని అడగ్గానే వెంటనే “ఈ సినిమా కోసం మా నిర్మాతలు ఎంతో ఖర్చు పెట్టారు. కనీసం యాబై రూపాయలు అయినా టికెట్ పెట్టి చూసి తెలుసుకోండి అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు ప్రభాస్. నిజమే యూవీ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. దాదాపు రెండొందల కోట్ల పైనే ఖర్చు పెట్టారు.  ప్రేక్షకులకు ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో సరికొత్త ప్రేమ కథని చూపించడానికే.

ఇక ప్రభాస్ మార్కెట్ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తో ఓ రేంజ్ కెళ్ళింది. అన్ని భాషల్లో ప్రభాస్ సినిమాకి డిమాండ్ పెరిగింది. అందుకే ఈ ప్రేమ కథ కోసం ఎవరూ ఖర్చు పెట్టనంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేసి మార్చ్ 11న అందరికి ఓ గొప్ప అనుభూతి అందించబోతున్నారు  నిర్మాతలు. ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకోవడం ఖాయమనిపిస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics