'ఉప్పెన' ట్రైలర్ రివ్యూ

Thursday,February 04,2021 - 05:16 by Z_CLU

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ ట్రైలర్ రిలీజైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్టర్ గా మారి తీసిన ఈ ఎమోషనల్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. “ప్రేమంటే ఓ లైలా మజ్నులా” అంటూ ప్రేమ గురించి ఆశీ(వైష్ణవ్ తేజ్) గొప్పగా చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ తర్వాత రొమాంటిక్ సీన్స్ , సాంగ్, యాక్షన్ షాట్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. సినిమాలో వైష్ణవ్ తేజ్ -కృతి శెట్టిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే విజయ్ సేతుపతి వయిలెంట్ యాక్షన్ సినిమాకు ప్లస్ అవ్వనుందనిపిస్తుంది.

డైరెక్టర్ బుచ్చిబాబు తన డెబ్యూ కోసం ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని పిక్ చేసుకొని దాని చుట్టూ మంచి కథనం అల్లి ప్రేక్షకులను తన సినిమాతో ప్రేమలో పడేయబోతున్నాడనేది క్లియర్ కట్ గా విజువల్స్ తో తెలుస్తుంది.

రెండు నిమిషాల పది సెకన్ల ట్రైలర్ లో లవ్ సీన్స్ , విజువల్స్ , డైలాగ్స్ తో పాటు దేవి మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. సినిమాకు దేవి ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చినట్టు ప్రతీ సౌండింగ్ లో వినిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమాపై ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉన్న ఓ మోస్తరు అంచనాలను  తారా స్థాయికి చేర్చి సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది.

మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రేమ కథ ఫిబ్రవరి 12 న థియేటర్స్ లోకి రానుంది.

Also Check ‘ఉప్పెన’ కోసం మెగా స్టార్ !