'ఉప్పెన' రిలీజ్ ఫిక్స్?

Monday,May 18,2020 - 12:01 by Z_CLU

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్స్ గా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసుకొనే పనిలో ఉన్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈపాటికి థియేటర్లలో ఉండేది. కానీ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఆగస్ట్ 15 న డేట్ లాక్ చేసుకున్నట్లు టాక్.

అప్పటివరకు అన్ని చక్కబడి థియేటర్లు ఓపెన్ అయితే పరవాలేదు. లేదంటే సెప్టెంబర్ లో వినాయకచవితి కి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలా 2-3 డేట్స్ ఫిక్స్ చేసుకున్న మేకర్స్ థియేటర్స్ తెరిచే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటే వినబడుతుంది. బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి సందడి చేసి ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.