ఉప్పెన.. .ప్రమోషన్స్ మొదలెట్టారు

Thursday,April 02,2020 - 11:57 by Z_CLU

అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా ఈరోజు ‘ఉప్పెన’ థియేటర్స్ లోకి వచ్చుండేది. ఏప్రిల్ 2న విడుదల అంటూ ఎప్పటినుండో చెప్తున్న మేకర్స్ కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇంకా కొత్త డేట్ ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మళ్ళీ ప్రమోషన్స్ మాత్రం మొదలుపెట్టారు.

సినిమా ఆల్బం నుండి రిలీజయిన ఫస్ట్ సింగిల్ వ్యూస్ కౌంట్ చెప్తూ మొన్న ఓ పోస్టర్ వదిలిన టీం నిన్న విజయ్ సేతుపతి లుక్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈరోజు శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్తూ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలతో మరో పోస్టర్ విడుదల చేశారు.

ఇలా రోజుకో పోస్టర్ వదులుతూ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ జాయింట్ గా నిర్మిస్తున్నాయి.