సెంటిమెంట్ రిలీజ్ డేట్

Saturday,March 21,2020 - 12:10 by Z_CLU

లెక్కప్రకారం ఏప్రిల్ 2న థియేటర్లలోకి రావాలి ఉప్పెన సినిమా. అదే తేదీకి రానా నటించిన అరణ్య సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల అరణ్య సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఉప్పెన కూడా వాయిదా బాట పట్టింది.

అయితే సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. ఈ విషయంలో ఉప్పెన అందరికంటే ముందుంది. ఏప్రిల్ 2 నుంచి వాయిదా పడిన ఈ సినిమాను మే 7న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్.

ఇంత కచ్చితంగా ఈ డేట్ చెప్పడానికి ఓ సెంటిమెంట్ ఉంది. మే 7న సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా థియేటర్లలోకి వచ్చింది. సుక్కూకు అదే ఫస్ట్ మూవీ. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరక్టర్ గా పరిచయమౌతున్న సినిమా ఉప్పెన. అందుకే సెంటిమెంట్ ప్రకారం మే7న ఉప్పెనను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.