2021 Sankranthi - లిస్ట్ లో మరో సినిమా

Friday,October 30,2020 - 12:16 by Z_CLU

వచ్చే సంక్రాంతికి ఓ అరడజను సినిమాలు రెడీ అవుతున్నాయి. కాగా ఇప్పుడీ లిస్టులో మరో సినిమా చేరబోతుంది. అవును కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రిలీజ్ వరకూ వచ్చి వెనక్కి వెళ్ళిన Uppena సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జనవరి మొదటి వారంలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ లో మూడో సాంగ్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పడీ ఆల్బం నుండి వచ్చే మరో సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని టాక్. Devi Sri Prasad మ్యూజిక్ అందిస్తున్న ఈ ఆల్బం సినిమాకు పెద్ద ఎస్సెట్ కానుందనడంలో సందేహమే లేదు. Mythri Movie Makers, Sukumar Writings సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో BuchiBabu దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Vaishnav Tej, Krithi Shetty లకు ఇది డెబ్యూ మూవీ.

Also Check – ఉప్పెన మూవీ స్టిల్స్