ఫస్ట్ వేవ్ తో ఎట్రాక్ట్ చేస్తున్న 'ఉప్పెన'

Wednesday,February 05,2020 - 12:12 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ అనే సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఫస్ట్ వేవ్ పేరుతో ఓ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ‘బేబమ్మా’ అంటూ వైష్ణవ్ తేజ్ సముద్రపు కెరటాల శబ్దాన్ని అదిగమించేలా అరవడం, ఆ తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ను బస్ కిటికీ నుండి చున్నీ మద్యలో అందంగా చూపించిన షాట్ తో టీజర్ ను ముగించారు.

అయితే ఫస్ట్ వేవ్ లో సినిమాటోగ్రఫీ , కృతి శెట్టి , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 14 సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 2న సినిమా థియేటర్స్ లోకి రానుంది.