#Uppena - కాంబినేషన్ రిపీట్?

Saturday,April 17,2021 - 02:18 by Z_CLU

ఒక సినిమా సూపర్ హిట్టయితే వెంటనే ఆ కాంబోలో మళ్ళీ ఓ సినిమా ప్లానింగ్ జరుగుతుంటుంది. అలాంటిది బ్లాక్ బస్టర్ కొడితే ఇక ఆ కాంబోలో మరో సినిమా చాలా తక్కువ టైంలో వచ్చేయడం కామన్. ఇప్పుడు అలాంటి ఓ బ్లాక్ బస్టర్ కాంబోలో మరో సినిమా రానుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అవును ఉప్పెన తో 100 కోట్ల క్లబ్ లో నిలిచిన దర్శకుడు బుచ్చిబాబు -వైష్ణవ్ తేజ్ మళ్ళీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

తాజాగా ఎన్టీఆర్ కి కథ చెప్పాడు బుచ్చిబాబు. తారక్ తో ఇప్పటికే రెండు మీటింగ్స్ కూడా జరిగాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు బుచ్చి. ఫైనల్ మీటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక ‘RRR’ తర్వాత కొరటాల శివ #NTR30 చేయబోతున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే తెరకెక్కనుందని సమాచారం.

uppena-vaishnav-tej-krithi-shetty

అయితే తారక్ కొరటాల సినిమా కంప్లీట్ చేసే లోపు తన మొదటి హీరో వైష్ణవ్ తో రెండో సినిమా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ లవ్ స్టోరీ సిద్దం చేసుకొని దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. తనకి మంచి లాంచ్ ఇచ్చిన బుచ్చిబాబు అడగడమే ఆలస్యం వైష్ణవ్ డేట్స్ అడ్జెస్ట్ చేశాడట. మరి ఈ కాంబో సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics