Uppena - రిలీజ్ ఎప్పుడంటే?

Friday,September 25,2020 - 12:58 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన సినిమాల లిస్టులో Uppena ఒకటి. అన్ని అనుకున్నట్లు జరిగితే Vaishnav Tej, Krithi Shetty లు హీరో హీరోయిన్ గా నటించిన ఈ లవ్ స్టోరీ ఈ ఏడాది మార్చ్ లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లు మూతపడటంతో మేకర్స్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. మరికొన్ని రోజులు డబ్బింగ్ పూర్తవ్వగానే మొదటి కాపీ రెడీ అవుతుంది. సంక్రాంతి కి ఇంకా మూడు నెలలు ఉంది కనుక వచ్చే నెల నుండి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టబోతున్నారట.

Mythri Movie Makers, Sukumar Writings నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. Devi Sri Prasad మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ కానుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆల్బం నుండి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.