"కబ్జా" చేయడానికి రెడీ అయిన ఉపేంద్ర

Saturday,January 04,2020 - 02:51 by Z_CLU

ఓం, ఎ, రా, చిత్రాలతో సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర “సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం”కబ్జా”. 1947-80ల మధ్య అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది.

శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఘనంగా ప్రారంభం అయింది. పూజాకార్యక్రమాల అనంతరం ఉపేంద్ర పై చిత్రీకరించిన ముహూర్తుపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, ఈ సన్నివేశానికి బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.. ఇదే వేదికపై కబ్జా మోషన్ పోస్టర్ ని లగడపాటి శ్రీధర్ లాంచ్ చేశారు.

డిఫరెంట్ స్టయిల్ లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. తెలుగు, కన్నడ భాషల్లో రాబోతోంది ఈ మూవీ.