మహేష్ కి విలన్ ఎవరంటే?

Sunday,April 12,2020 - 12:08 by Z_CLU

కన్నడ స్టార్ ఉపేంద్రకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఉపేంద్ర నటించిన సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ మధ్య బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఓ నెగిటివ్ రోల్ చేసిన ఉపేంద్ర మళ్లీ ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

అవును సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ సినిమాలో ఉపేంద్ర విలన్ గా కనిపిస్తాడని టాక్. పరశురాం బుజ్జీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర పేరును పరశురామ్ చెప్తే మహేష్ ఒకే అన్నాడట.

తాజాగా ఉపేంద్ర నుండి కూడా దర్శకుడు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి మహేష్ కి విలన్ గా కనిపించనున్న ఉపేంద్ర ఈ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో..చూడాలి.