Akhil Agent - కన్నడ స్టార్ ఎంట్రీ?
Saturday,June 05,2021 - 01:56 by Z_CLU
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ నెక్స్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ సినిమాలో కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సురేందర్ రెడ్డి. సినిమాలో ఓ కీలక రోల్ కోసం కన్నడ స్టార్ ఉపేంద్ర ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఉపేంద్ర
గతంలో ఉపేంద్ర అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో కూడా ఉపేంద్ర క్యారెక్టర్ చేస్తున్నాడు. సినిమాలో వరుణ్ కి బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే అఖిల్ సినిమాలో కూడా అలాంటి ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయనున్నాడని తెలుస్తుంది. క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ హీరో తర్వాత కథలో కీలకమని టాక్.

ఏజెంట్ మూవీలో అఖిల్
ప్రస్తుతానికైతే ఇంకా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ తాజాగా సురేందర్ రెడ్డి ఉపెంద్ర ని సంప్రదించారని వినిపిస్తుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అఖిల్ ని సరికొత్తగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడు సురేందర్ రెడ్డి. హీరోకి అపోజిట్ విలన్ క్యారెక్టర్ ని కూడా స్ట్రాంగ్ గా ఉండేలా పాన్ చేస్తున్నాడట. ఆ క్యారెక్టర్ ని ఉపేంద్రతో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.
మరి కన్నడ స్టార్ ఉపేంద్ర అఖిల్ సినిమాలో నటిస్తాడా ? అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ -స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics