బన్నీ-లింగుస్వామి సినిమాపై డౌట్స్..?

Tuesday,February 21,2017 - 12:40 by Z_CLU

బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ తో DJ సినిమాపై సెట్స్ పై ఉన్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ తో ఈ సినిమా మరింత కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. అయితే అంతలో బన్నీనెక్స్ట్ సినిమాపై ఓ కొత్త బజ్, చిన్న సైజు డిస్టబెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే అనౌన్స్ అయిన లింగుస్వామి సినిమా నుంచి బన్నీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, లేదంటే ఆ మూవీని కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

DJ తర్వాత బన్ని ప్లాన్స్ ఏంటి…? నిన్నటి వరకు లింగుస్వామితో సినిమా గ్యారంటీ అని క్లారిటీ ఉన్నా, ఇప్పుడీ సినిమా డ్రాప్ అవుతుందనే టాక్ వచ్చేసరికి సినీటౌన్ లో బన్ని నెక్స్ట్ సినిమా ప్లేస్ లో కొత్త క్వశ్చన్ మార్కే రేజ్ అవుతుంది. DJ తో పాటు ఇంకా స్టోరీస్ ని ఫైనలేజ్ చేసే పనిలో ఉన్న బన్నీ… ప్రస్తుతానికి కోలీవుడ్ ఎంట్రీ ఐడియాను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. డీజే తర్వాత కూడా ఓ తెలుగు సినిమానే చేయాలని అనుకుంటున్నాడట.

బన్నీ లిస్ట్ లో ప్రస్తుతానికి విక్రమ్ కుమార్, వక్కంతం వంశీ ఉన్నారు. వీళ్లలో విక్రమ్ కుమార్.. అఖిల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సో.. లిస్ట్ లో వక్కంతం వంశీ మాత్రమే మిగిలాడు. రీసెంట్ గా వక్కంతం చెప్పిన స్టోరీలైైన్ ను బన్నీ ఫైనలైజ్ చేశాడని.. నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారంటూ వాార్తలు వచ్చాయి. సో.. డీజే తర్వాత వక్కంతంను దర్శకుడిగా పరిచయం చేస్తూ, బన్నీ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయట.