బాలయ్య సినిమాకు లైన్ క్లియర్

Monday,June 10,2019 - 04:06 by Z_CLU

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. అంతకుమించి ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక దశలో సినిమా ఆగిపోయిందనే గాసిప్ కూడా బయల్దేరింది.

ఫైనల్ గా ఈ కాంబోపై ఓ క్లారిటీ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 రోజుల్లో మూవీ లాంఛనంగా ప్రారంభమౌతుంది.

ఈరోజు బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడ్ని కలిసి విషెష్ చెప్పారు నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు కేఎస్ రవికుమార్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బుధవారం రోజున ఈ సినిమా లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి.

బాలయ్యకు కేఎస్ రవికుమార్ చెప్పిన కథ వేరు. తాజాగా బాలయ్య ఓకే చేసిన కథ వేరు. మారిన రాజకీయ పరిస్థితుల మధ్య, సినిమా స్టోరీని కూడా మార్చమని బాలయ్య చెప్పడంతో, ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పుడీ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్ అయినట్టే.