Upasana Konidela - దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్
Thursday,April 06,2023 - 02:39 by Z_CLU
Upasana and Ram Charan Celebrate Baby Shower in Dubai
రామ్ చరణ్ భార్య, చిరంజీవి కోడలు ఉపాసన కొణెదల ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరో వేడుక జరిగింది. ఉపాసన బేబీ షవర్ (శ్రీమంతం) వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక కోసం అంతా కలిసి దుబాయ్ వెళ్లారు.

భర్త రామ్ చరణ్‌తో కలిసి దుబాయ్‌లో బేబీ షవర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది ఉపాసన. ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడముచ్చటగా ఉంది. ఉపాసనకు ఎల్లప్పుడూ మద్ధతు అందించే ఆమె సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వహించారు.

రామ్ చరణ్‌తో (Ramcharan) కలిసి జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన (Upasana Kamineni) గర్భందాల్చడంతో మెగా కాంపౌండ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. మెగా వారసుడికి ఆహ్వానం పలికేందుకు అంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ అపోలోలోనే ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రపంచప్రసిద్ధి చెందిన గైనకాలజిస్టులు కొందరు ఉపాసన ను ట్రీట్ చేస్తున్నారు.