మరికొన్ని గంటల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Wednesday,October 25,2017 - 12:51 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ-రిలీజ్ వేడుక ఉంటుంది.

రామ్-కిషోర్ తిరుమలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ. మరోవైపు రామ్, దేవిశ్రీది కూడా సూపర్ హిట్ కాంబో. వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఐదో సినిమా ఇది. ఇప్పటికే సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతూనే సినిమా విశేషాల్ని పంచుకోబోతోంది యూనిట్.

హీరో, దర్శకుడితో పాటు హీరోయిన్లు అనుపమ, లావణ్య ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకాబోతున్నారు. ఈ శుక్రవారం (అక్టోబర్ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా  విడుదలకానుంది ఉన్నది ఒకటే జిందగీ.