మనకు తెలియని 'మహానటి'

Wednesday,May 09,2018 - 04:30 by Z_CLU

‘మహానటి’ సావిత్రి సినీ జీవితం గురించి అప్పటి తరానికి బాగా తెలుసు..అయితే అప్పటి తరానికి ఇప్పటి తరానికి చెందిన సామాన్య జనాలకు సావిత్రి గురించి తెలియని కొన్ని విషయాలను మహానటి సినిమాలో చూపించి వాటితో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసారు.

 

సావిత్రి అనగానే టక్కున గుర్తుచ్చేది ఆమె నటన అభినయం.. అయితే అవి మాత్రమే కాకుండా సావిత్రి దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరించడం చూపించారు. దర్శకురాలిగా ఆమె తెరకెక్కించిన సినిమాలు ఆ సందర్భంలో ఎదుర్కున్న సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

నిజానికి సావిత్రి నటన మీదే కాకుండా క్రీడా రంగంలోనూ ఎంతో ఆసక్తి కనబరిచేవారట. ముఖ్యంగా క్రికెట్, చదరంగం ఆటలంటే ఆమెకి వల్లమాలిన మక్కువ. వీటితో పాటు రేసు కార్లు కలెక్షన్ చేసేవారట.. ఈ విషయాన్నీ ఓ సందర్భంలో ప్రత్యేకంగా చూపించారు. కొత్తగా వచ్చిన రేసు కారు మద్రాస్ లోనే మొదటి కారు అంటూ సావిత్రి రోల్ లో నటించిన కీర్తి ఆ కారు గురించి ఓ డైలాగ్ చెప్తూ నాతో రేసుకు వాస్తావా..అంటూ ఓ కుర్రాడితో రేసులో పాల్గొనే సీన్ కూడా సినిమాలో ఉంది. ముఖ్యంగా సావిత్రి ఎడమచేతివాటం ఉందని ఓ సందర్భంలో సిగ్నేచర్ పెడుతూ ఆ విషయాన్నీ తెలియజేసారు.

ఏ పాత్రలో అయినా ఒద్దికగా ఒదిగిపోయి నటించి ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోయిన మహానటి బహు చమత్కారి. ఈ విషయాన్నీ చిన్నతనం నుండే చూపిస్తూ వచ్చాడు దర్శకుడు. అంతేకాదు ఇతరులను అనుకరించడంలో దిట్ట కూడా. మరీ ముఖ్యంగా ఎస్.వి.రంగారావు గారిని బాగా అనుకరించేవారట. ఓ సందర్భంలో ఎస్.వి.ఆర్ ను అనుకరించడం సినిమాలో చూపించారు. ఆ సీన్ సినిమాలో భలే పండింది.

నటిగా ఆమె ఘనమైన వైభవం అందుకున్న సమయంలో ఎన్నో దాన ధర్మాలు చేసారట. అంతేకాదు బందువులకు ఆభరణాలు, స్థలాలు కూడా కొనిచ్చిన ఘనత సావిత్రి ది. ఆ దాన ధర్మాలు వాటి వాళ్ళ ఆమె పడిన ఇబ్బందులతో వచ్చే సీన్స్ ఆమె మీద మరింత గౌరవంపెరిగేలా చేసాయి.

1968 వ సంవత్సరంలో సావిత్రి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి ఓ ప్రత్యేకత వుంది. దాదాపు ఆ సినిమా కోసం అందరూ మహిళలే పనిచేసారు. ఆ సినిమా విషయాలను ఓ సందర్భంలో దర్శకుడు జరిగిందంతా చూపించాడు.

ఇవే కాదు సావిత్రిస్టార్ డం అందుకున్నాక ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. జెమినీ గణేషన్ అసలు సావిత్రి ఎలా పరిచయం అయ్యాడు.. చివరి రోజుల్లో ఆమె ఎలాంటి వేదనకు గురైంది..ఎంతటి క్షోభ అనుభవించింది. అనేవి బాగా తెరకెక్కించి మెస్మరైజ్ చేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్.  మహానటి కి సంబంధించి ఆమె జీవితంలో జరిగిన ఎన్నో   విషయాలు తెలుసుకోవాలంటే మహానటి కచ్చితంగా చూడాల్సిందే..