ప్రమోషన్ పనుల్లో ఉంగరాల రాంబాబు

Friday,February 03,2017 - 04:08 by Z_CLU

సునీల్ ఉంగరాల రాంబాబు లా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటిస్తూనే కామెడీకి పెద్ద సోఫా వేసే సునీల్, క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో నటిస్తున్నాడు. రథ సప్తమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

ఇప్పటికే 90 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మ్యాగ్జిమం సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తుంది.

sunil-ungarala-rambabu-first-look-zee-cinemalu

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఉంగరాల రాంబాబు సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ గా సినిమాని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.