శ్రీదేవి ‘Mom’ లో ఎక్స్ పెక్ట్ చేయని స్టార్

Saturday,May 20,2017 - 12:30 by Z_CLU

శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘Mom’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ ప్రాసెస్ జరుపుకుంటుంది. నవాజుద్దీన్ సిద్దీఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో రీసెంట్ గా మరో స్టార్ కూడా చేరిపోయాడు. ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా ప్రముఖ పాకిస్తానీ స్టార్ అద్నాన్ సిద్దీఖీ నటించనున్నాడు. గతంలో ఎంజిలినా జోలీ, డ్యాన్ ఫటర్ మన్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అద్నాన్ ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ క్యారెక్టర్ కోసం కనీసం కాస్ట్ కూడా ఫైనలైజ్ కాకుండానే షూటింగ్ బిగిన్ చేసుకున్న సినిమా యూనిట్, శ్రీదేవి కూతురు జాహ్నవి సలహా మేరకు అద్నాన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటి  నుండి ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోన్ లో ఉంటున్న “Mom’ రోజు రోజుకి క్రేజ్ క్రియేట్ చేసుకుంటూనే ఉంది.

ఈ సినిమాలో మరో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏమిటంటే ‘Mom’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న శ్రీదేవి ఈ సినిమాలో మేకప్ లేకుండా నటిస్తుంది. ఈ విషయం జస్ట్ బాలీవుడ్ నే కాదు టాలీవుడ్ ని కూడా షేక్ చేసేస్తుంది. న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేసే ఈ అతిలోకసుందరి న్యాచురల్ లుక్స్ తో ఎంటర్ టైన్ చేయనుందనే టాక్, ఈ సినిమాపై హై ఎండ్ హైప్ ని క్రియేట్ చేస్తుంది.