ఊహించని కాంబినేషన్స్

Thursday,June 20,2019 - 10:03 by Z_CLU

కొత్త కథలే కాదు… అసలు పాసిబుల్ కాదు అనే కాంబినేషన్స్ కూడా సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. దాంతో రెగ్యులర్ క్యారెక్టర్స్ లో కనిపించే హీరోల్ని కాస్త కొత్తగా చూసే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం కనీసం ఇంతకు ముందు ఫ్యాన్స్ ఊహించని కాంబినేషన్స్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

పూరి రామ్ : ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని కొంచెం ముందుగానే విషయం బయటికి వచ్చినా ఈ కాంబినేషన్ మాత్రం ఊహించనిదే. అందునా ఈ మధ్య రామ్ ని లవర్ బాయ్ గా, సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చూస్తూ అలవాటు పడిపోయిన ఫ్యాన్స్, పూరి మార్క్ హీరోగా రామ్ ని చూడటం సర్ ప్రైజింగ్ ఎలిమెంటే…

 

మహేష్ బాబు – అనిల్  రావిపూడి : ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి ఎవరికీ ఆలోచన కూడా లేదు. అనిల్ రావిపూడి తన పంథాలో తాను సినిమాలు చేసుకుంటూ పోవడం, అంతలో F2 బ్లాక్ బస్టర్ అవ్వడం, మహేష్ బాబుకి కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేసేద్దాం అనే ఆలోచన రావడం.. కట్ చేస్తే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా… బయటికి వచ్చిన టాక్ జస్ట్ రూమరా..? లేక అఫీషియలా అని డిసైడ్ అయ్యేలోపు సినిమాని అనౌన్స్ చేశారు మేకర్స్..

రవితేజ – Vi ఆనంద్ : Vi ఆనంద్ ‘ఒక్కక్షణం’ సక్సెస్ తరవాత ఈ సారి ఈ దర్శకుడు చేయబోయేది బడా స్టార్ తోనే అని గెస్ చేసినా, ఆ స్పేస్ లో మాస్ మహారాజ్ రవితేజని మాత్రం ఎవరూ ఊహించలేదు. ‘డిస్కోరాజా’ సినిమా కోసం ఈ రేర్ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చింది.

ప్రశాంత్ వర్మరాజశేఖర్ : ‘గరుడవేగ’ తరవాత యాంగ్రీ స్టార్ తో సినిమా చేయబోయే డైరెక్టర్ ఎవరా అనే క్యూరియాసిటీ ఉంది కానీ ఆ ప్లేస్ లో ప్రశాంత్ వర్మ పేరుంటుందని ఎవరూ గెస్ చేయలేదు. ‘అ!’ సినిమాతో డిఫెరెంట్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ తో సినిమా అనుకోవడం ఊహించనిదే.

నాగార్జునరాహుల్ రవీంద్రన్ : ‘మన్మధుడు’ కి సీక్వెల్ చేస్తానంటే ఎవరు కాదంటారు… కానీ ఈ సినిమా రాహుల్ రవీంద్రన్ తోనే పాసిబుల్ అవుతుందనేది చి.ల.సౌ సినిమా రిలీజయినప్పుడు కూడా ఎవరూ గెస్ చేయలేదు. జస్ట్ ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ ‘మన్మధుడు’ సీక్వెల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని అస్సలు ఊహించలేదెవరు…