ఇస్మార్ట్ శంకర్.. మణిశర్మ బ్రాండ్ సాంగ్

Saturday,June 29,2019 - 03:10 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి మరో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు హిట్ అవ్వగా, తాజాగా రిలీజైన పాట అంతకుమించి అనిపించుకుంది. మణిశర్మ కంపోజ్ చేసిన మెలొడీ ఇది.

ఉండిపో అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. భాస్కర భట్ల సాహిత్యం అందించారు. ఈ పాటతో మరోసారి మెలొడీ బ్రహ్మ అనిపించుకున్నారు మణిశర్మ. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్, నిధి అగర్వాల్ మధ్య పిక్చరైజ్ చేసిన ఈ పాట మెలొడీగానే కాకుండా, విజువల్ పరంగా కూడా ఎట్రాక్ట్ చేయబోతోంది. జులై 18న థియేటర్లలోకి రానుంది ఇస్మార్ట్ శంకర్ మూవీ.