ఎక్స్ పెక్ట్ చేయని ఆంగిల్

Monday,April 10,2017 - 11:27 by Z_CLU

స్టార్ హీరోయిన్స్ తో పోలిస్తే కాస్త స్లో పేజ్ లోనే ఉన్నా ప్రస్తుతం బడా బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి రాశి ఖన్నా చేతిలో. గోపీచంద్ ఆక్సిజన్, NTR జై లవకుశ సినిమాలతో సెట్స్ పై ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ రెండు సినిమాల తరవాత స్టార్ హీరోయిన్స్ సరసన చేరిపోవడం గ్యారంటీ. వచ్చిన అవకాశాల్లోంచి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్న రాశిఖన్నా జస్ట్ స్టార్ ఇమేజ్ తన టార్గెట్ కాదని చిన్న షాకే ఇచ్చింది.

తెలుగులో కొద్దో గొప్పో గుర్తింపు వచ్చిందో లేదో, మెల్లిగా తమ కరియర్ ట్రాక్ ని అటు కోలీవుడ్, మాలీవుడ్ వైపు విస్తరించేస్తారు మన స్టార్ హీరోయిన్స్. దానికి తోడు ఎంట్రీ కూడా అంతే గ్లామరస్ ఉండేటట్టు కేర్ తీసుకుంటారు. అది చాలా చాలా కామన్. కానీ రాశిఖన్నా డిఫెరెంట్ ఆంగిల్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

మోహన్ లాల్ హీరోగా ఉన్ని కృష్ణన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో చాన్స్ కొట్టేసింది రాశి ఖన్నా. అయితే ఈ సినిమాలో టఫ్ఫెస్ట్ పోలీసాఫీసర్ గా కనిపించనున్న రాశి, కంప్లీట్ నెగెటివ్ రోల్ లో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు విశాల్, హన్సిక కూడా కొన్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.