`ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య` టీజ‌ర్ రిలీజ్

Friday,February 21,2020 - 03:12 by Z_CLU

కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా తెరకెక్కిన సినిమా ఇది. `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి రీమేక్‌ గా వస్తోంది `ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య`. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో వీకే నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.