అల్టిమేట్ స్పై థ్రిల్లర్ వివేకం

Thursday,July 20,2017 - 04:18 by Z_CLU

వివేకం అజిత్ కి తమిళంతో పాటు తెలుగులోనూ అల్టిమేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా రిలీజైన ‘వివేకం’ టీజర్ తో  ఈ సినిమా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్, సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

  అజిత్ హీరోగా 110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న అల్టిమేట్ స్పై థ్రిల్లర్ ‘వివేకం’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. జేమ్స్ బాండ్ సినిమా తరహాలో తెరకెక్కిన ‘వివేకం’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా సినిమా యూనిట్.