నాగచైతన్య-సమంత కోసం 2 రిసెప్షన్లు

Friday,October 13,2017 - 06:15 by Z_CLU

గోవాలో పెళ్లి చేసుకున్న నాగచైతన్య-సమంత ఈ వీకెండ్ హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఇస్తారని అంతా ఊహించారు. కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదని నాగార్జున ప్రకటించాడు. నాగచైతన్య-సమంత తమ సినిమాల నుంచి కాస్త ఫ్రీ అయిన తర్వాత రిసెప్షన్ తేదీని ప్రకటిస్తామని.. రాజుగారి గది-2 ప్రమోషన్ సందర్భంగా వెల్లడించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. 2 రిసెప్షన్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నారట.

సమంత-నాగచైతన్య 2సార్లు పెళ్లి చేసుకున్నారు. హిందు, క్రిస్టియన్ పద్ధతుల్లో వీళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడు రిసెప్షన్ కూడా రెండు సార్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటి హైదరాబాద్ లో, ఇంకోటి చెన్నైలో పెట్టాలనేది తాజా ప్లాన్. సమంతకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా చాలా పరిచయాలున్నాయి. ఎంతోమంది సన్నిహితులున్నారు. వాళ్ల కోసం చెన్నైలో కూడా ఓ రిసెప్షన్ పెట్టాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతానికి నాగచైతన్య-సమంత తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రేపట్నుంచి మహానటి సెట్స్ పైకి వెళ్లనుంది సమంత. ఆదివారం నుంచి సవ్యసాచి సినిమా ప్రారంభించే ఆలోచనలో నాగచైతన్య ఉన్నాడు.