RamCharan - నెల గ్యాప్ లో 2 సినిమాలు

Tuesday,January 25,2022 - 05:03 by Z_CLU

Two Movies from RamCharan within 1 month gap

అదేంటి మెగా పవర్ స్టార్ నుండి నెల గ్యాప్ లో రెండు సినిమాలా ? అదెలా అనుకుంటున్నారా ? అవునండీ రామ్ చరణ్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవి రెండూ నెల గ్యాప్ లోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన ‘RRR’ కి సంబంధించి రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. మొదట సంక్రాంతి బరిలో నిలిచి మళ్ళీ వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 18 న కానీ ఏప్రిల్ 28 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఇక రామ్ చరణ్ తండ్రి చిరుతో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ ఏప్రిల్ 1న రిలీజ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఒక వేళ RRR మార్చ్ 18న వస్తే సరిగ్గా పన్నెండు రోజులకే ఆచార్య తో మళ్ళీ థియేటర్స్ లోకి వస్తాడు చెర్రీ. లేదా RRR ఏప్రిల్ 28న విడుదలైతే సరిగ్గా దానికంటే ఇరవై ఎనిమిది రోజుల ముందే ఆచార్య తో వస్తాడు.

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఏదైనా ఆచార్య మాత్రం ఏప్రిల్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని వినిపిస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రెండు సినిమాలు ప్రకటించిన డేట్స్ కి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి. అలా రిలీజైతే మాత్రం నెల గ్యాప్ లో రామ్ చరణ రెండు సినిమాలతో మెగా అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.