రంగస్థలం నుంచి మరో 2 ఇంట్రెస్టింగ్ ఫొటోస్

Tuesday,November 07,2017 - 01:35 by Z_CLU

తను హీరోగా నటిస్తున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టిల్స్ షేర్ చేస్తూనే ఉన్నాడు రామ్ చరణ్. తాజాగా ఈ లిస్ట్ లోకి సమంత కూడా చేరింది. ఈ హీరోహీరోయిన్లు ఇద్దరూ ఒకేసారి రంగస్థలం సినిమాకు సంబంధించి 2 స్టిల్స్ రిలీజ్ చేశారు. 1980లనాటి కార్నివాల్ (జాతర)ను తలపించేలా వేసిన సెట్ పిక్స్ ఇవి.

ఇప్పుడు మీరు చూస్తున్నది కార్నివాల్ లాంగ్ షాట్. వెనక నుంచి కనిపిస్తున్నవ్యక్తి రామ్ చరణే. హైదరాబాద్ బూత్ బంగ్లా సమీపంలో వేసిన ఈ సెట్ స్టిల్ ను చరణ్ షేర్ చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా సాగుతుందని ప్రకటించాడు.

ఇక ఈ స్టిల్ ను సమంత రిలీజ్ చేసింది. కార్నివాల్ సెట్ లో ఓ పార్ట్ ఇది. రంగస్థలం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ప్రకటించిన సమంత.. నిజాయితీగా తీస్తున్న ఇలాంటి సినిమాలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది.