రోగ్ లో ఇద్దరు....

Saturday,February 18,2017 - 04:22 by Z_CLU

ఇషాన్‌ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రోగ్‌’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలు పెంచేయడంతో పూరి ఖాతాలో మరో యూత్ ఫుల్ హిట్ కన్ఫర్మ్ అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది…

‘మరో చంటి గాడి ప్రేమకథ’ అనే టాగ్ లైన్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా రూపొందుతున్న ఈ సినిమా లో ఇషాన్ సరసన మన్నారు చోప్రా, ఏంజెలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే అనుష్క , అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్‌ చేసిన పూరి ఈ సినిమా తో ‘ఏంజెలా’ అనే మోడల్ ను హీరోయిన్ గా టాలీవుడ్కి ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 19న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్న మేకర్స్ సినిమాను మార్చ్ లో థియేటర్స్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు….