Tuck Jagadish Teaser - కాన్సెప్ట్ బాగుంది

Tuesday,February 23,2021 - 05:53 by Z_CLU

సినిమాకు మొట్టమొదటి పబ్లిసిటీ ఎలిమెంట్ టీజర్. ఇది ఎంత బాగుంటే, సినిమాపై బజ్ అంత పెరుగుతుంది. అందుకే టీజర్ పై మేకర్స్ స్పెషల్ కేర్ పెడతారు. ఇక ఈ రోజు రిలీజైన టక్ జగదీశ్ టీజర్ చూస్తే.. ఈ కేర్ ఇంకాస్త ఎక్కువ తీసుకున్నట్టు అర్థమౌతోంది.

ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ మొత్తాన్ని ఓ ఫోక్ సాంగ్ పై కట్ చేశారు. టీజర్ ను ఇలా కట్ చేయాలనే ఆలోచన బాగుంది. ఇక రెండో విషయానికొస్తే.. ఈ సినిమాను ఇన్నాళ్లూ ఓ కుటుంబకథా చిత్రంగా చూశారంతా. ఆ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ కూడా ఫుల్ గా ఉంటుందని టీజర్ లో చెప్పేశారు.

నాని మరోసారి తన సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడు. నాని-రీతూ వర్మ జోడీ బాగుంది. తమన్ అందించిన ఫోక్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోందనే విషయం కూడా టీజర్ లో తెలుస్తోంది.

కేవలం హీరోహీరోయిన్లకే టీజర్ ను పరిమితం చేయకుండా.. దాదాపు అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు. ఇంకా చెప్పాలంటే దీన్ని టీజర్ అనే కంటే మినీ ట్రయిలర్ అనడం కరెక్ట్. టీజర్ చివర్లో నానికి బర్త్ డే విశెష్ చెప్పిన యూనిట్, ఏప్రిల్ 23న థియేటర్లలోకి రాబోతున్నట్టు ప్రకటించారు.