చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన 'ట‌క్ జ‌గ‌దీష్‌'

Saturday,December 05,2020 - 12:19 by Z_CLU

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ట‌క్ జ‌గ‌దీష్’ షూటింగ్ చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు.

నాని కెరీర్ లో 26వ సినిమాగా వస్తున్న టక్ జగదీష్ ను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిన్న ప్రారంభ‌మైన లాస్ట్ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలకమైన నటీనటులంతా పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..

ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.