చిరంజీవిని ఘనంగా సన్మానించిన సుబ్బరామిరెడ్డి

Friday,January 20,2017 - 07:23 by Z_CLU

150తో సినిమాతో గ్రాండ్ ఎఁట్రీ ఇచ్చి, మెగా హిట్ అందుకున్న చిరంజీవిని… టి. సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. హైదరాాబాద్ పార్క్ హయత్ లో జరిగిన ఈ ఆత్మీయ వేడుకలో చిరంజీవికి టీఎస్ఆర్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమానికి నాగార్జున, అమల, అఖిల్ తో పాటు… వీవీ వినాయక్, రామ్ చరణ్, సురేఖ, పరుచూరి బ్రదర్స్, బ్రహ్మానందం, అలీ, నాగబాబు, జయప్రద, దిల్ రాజు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

chiru-tsr-2

కేవలం చిరంజీవి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా… ఏకంగా వారం రోజుల్లో వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం అపూరూపమన్నారు సుబ్బరామిరెడ్డి. ధృవ సినిమా సూపర్ హిట్ అయినందుకు రామ్ చరణ్ కు కూడా కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.