చిన్న సినిమా నిర్మిస్తాడట...

Tuesday,October 11,2016 - 09:19 by Z_CLU

ఈమధ్య కాలంలో పూరి జగన్నాధ్, సుకుమార్, సంపత్ నంది లాంటి దర్శకులు నిర్మాతలుగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ కోవలోకి స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. త్వరలోనే నిర్మాతగా మారి ఓ చిన్న సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. పెళ్లిచూపులు సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ హీరోగా, నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇంకా చర్చలు జరుగుతన్నట్టు సమాచారం. సోమవారం త్రివిక్రమ్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్మాతగా తన ఎంట్రీ గురించి ప్రకటిస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
trivikram-pawan-kalyan-a-aa-audio-launch-35
ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కాటమరాయుడు షూటింగ్ లో ఉన్న పవన్.. త్వరలోనే త్రివిక్రమ్ తో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లో ఆలోచనలో ఉన్నాడు. పవన్ సినిమాను డైరక్ట్ చేస్తూనే, తను నిర్మాతగా ఓ చిన్న సినిమాను రూపొందించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని తెలుస్తోంది.