Varudu Kaavalenu Event త్రివిక్రమ్ స్పీచ్ !

Thursday,October 28,2021 - 04:48 by Z_CLU

Director Trivikram Speech at ‘Varudu Kaavalenu’ Event

వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాటల మాంత్రికుడి మాటలు హైలైట్ గా నిలిచాయి. సినిమా చూసిన ఆడియన్ లా సినిమా టీంతో తన ఎక్స్ పీరియన్స్ చెప్పుకున్నాడు త్రివిక్రమ్.

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ఇందులో కొన్నిపాత్రలు మనతోపాటు ఇంటికి వస్తాయి. మన ఇళ్లల్లో జరిగే ఆడ పిల్లల తాలూకు కథ ఇది. మనసుకు దగ్గరగా ఉంటుంది. శౌర్య బాగా యాక్ట్‌ చేశాడు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అదిరిపోతుంది. రీతూ పెళ్లి కథాంశం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు.  చాలాకాలం తర్వాత సినిమా మొత్తం చీరకట్టులో ఓ హీరోయిన్‌ని చూశాను. చినబాబుగారి మనసుకి దగ్గరైన సినిమా ఇది. కరోనా వల్ల ఏడాది కాలం వేచిచూశారు’’ అని అన్నారు.


– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics