త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్స్

Saturday,June 08,2019 - 10:02 by Z_CLU

త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫుల్ ఆఫ్ గ్లామర్.. అందుకే కొంచెం గట్టిగానే ట్రై చేసి ఎలాగోలా ఇంకో హీరోయిన్ కి స్పేస్ కుదిరేలా కథ రెడీ చేసుకుంటాడు. ఇప్పుడు బన్ని సినిమాలో కూడా అంతే… అసలు హీరోయిన్ పూజా హెగ్డేనే.. కానీ సెకండ్ హీరోయిన్ గా నివేత పేతురాజ్ ని ఫిక్స్ చేసుకున్నాడు.ఈ లెక్కన చూస్తే త్రివిక్రమ్ సినిమాలో నటించి సెకండ్ హీరోయిన్ అనిపించుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు…

ఈషా రెబ్బ: ‘అరవింద సమేత’ లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. పూజా హెగ్డేకి సిస్టర్ గా నటించింది.  సినిమా కొంచెం సీరియస్ నోట్ లో ఉంటుంది కాబట్టి, వీళ్ళిద్దరి మద్య కెమిస్ట్రీ ఎలివేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఈ సినిమాలో తక్కువే…

అనూ ఇమ్మాన్యువెల్ : ‘అజ్ఞాతవాసి’ లో సెకండ్ హీరోయిన్ గా చేసింది.  కథ కలిసొచ్చి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో నోటెడ్ స్పేస్ లో కనిపించింది. ఈ సినిమా అనూ ఇమ్మాన్యువెల్ కి పెద్దగా కలిసి రాకపోయినా, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘బయటికొచ్చి చూస్తే..’ అనే సాంగ్ వైడ్ రేంజ్ లో రీచ్ అయింది.

అ..ఆ : అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయింది ఈ సినిమాతోనే. జస్ట్ సెకండ్ హీరోయిన్ లా సాంగ్స్ కి పరిమితం చేద్దామనుకోకుండా, త్రివిక్రమ్ స్పెషల్ క్యారెక్టరైజేషన్ రాసుకోవడం, అనుపమకి భలే కలిసొచ్చింది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ అనిపించుకుంది.

నిత్యమీనన్ : S/o సత్యమూర్తిలో నటించింది. కరియర్ లోనే డిఫెరెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది. కాస్తంత కన్నింగ్ ఆటిట్యూడ్ తో నిత్య ఎలాంటి రోల్ అయినా అదరగొట్టేస్తుంది అనిపించుకుంది.

ప్రణీత : ‘అత్తారింటికి దారేది’  లో నటించింది సెకండ్ హీరోయిన్ గానే అయినా సినిమా అంతటా, కథలో న్యాచురల్ గా సింక్ అయిన రోల్ లో నటించింది ప్రణీత. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అనిపించుకుంది.

పార్వతి మెల్టన్ : ‘జల్సా’ లో నటించింది సెకండ్ హీరోయిన్ గా…  మాస్  వైబ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది.