ఆ మూడు విషయాలు దాచిన త్రివిక్రమ్

Tuesday,January 14,2020 - 01:00 by Z_CLU

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి 3 విషయాలు దాచేశాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఓ పాటలో బ్రహ్మానందం కనిపిస్తాడనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచాడు. ఇక శ్రీకాకుళం యాసలో ఓ పాట ఉంటుందని, అది కూడా ఫైట్ లో వస్తుందనే విషయాన్ని దాచేశాడు. దీంతో పాటు సుశాంత్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా దాచాడు. ఆ మూడు విషయాలు త్రివిక్రమ్ మాటల్లోనే..

“సినిమాలో చున్నీ ఫైట్‌తోటే షూటింగ్ మొదలుపెట్టాం. అలా రాం-లక్ష్మణ్ మాస్టర్స్‌తో మొదలుపెట్టాను. వాళ్లతో ప్రయాణం నాకొక తాత్విక ప్రయాణం. ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. ‘సిత్తరాల సిరపడు’ అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రాం-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం.”

“రాములో రాములా పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మా మీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. ఏనుగును గదిలో పెట్టి దాచలేం కదా. అలాగన్నమాట. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం.”

“సుశాంత్ నన్ను కథ కూడా అడగలేదు. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వద్దన్నాడు. తను చేసిన పాత్రను నిలబెట్టాడు. పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నాను. ఐ రెస్పెక్ట్ హర్. ‘నేను నెగ్గేవరకు అయినట్లు కాదు’ అనేది తన వాట్సాప్ స్టేటస్.”