త్రివిక్రమ్ కి ఇది మూడోసారి...

Friday,July 12,2019 - 10:02 by Z_CLU

సాధారణంగా పండగలని ప్రిఫర్ చేయడు త్రివిక్రమ్. సినిమా రెడీ అయిందంటే దగ్గరలో ఉన్న పాసిబుల్ డేట్ కి సినిమా రిలీజ్ అనుకుని ఫిక్సయిపోతాడు. కానీ గత 3 సినిమాలుగా స్టైల్ మార్చాడు. త్రివిక్రమ్ సినిమా అనగానే పండగ అనిపిస్తున్నాడు. సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వచ్చినా రిలీజ్ మాత్రం పండగకే అనిపిస్తున్నాడు.

అజ్ఞాతవాసి : త్రివిక్రమ్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ పండక్కి రిలీజైన సినిమా అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా రిలీజైందీ సినిమా. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3 వ సినిమా ఇది.

అరవింద సమేత : దసరా కానుకగా రిలీజైందీ సినిమా. త్రివిక్రమ్, NTR కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ కరియర్ లోనే స్పెషల్ గా నిలిచింది. దసరా సీజన్ ని మరింత స్పెషల్ గా మార్చేసిందీ ఈ సినిమా.

AA 19:  రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతికే అని అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో త్రివిక్రమ్ ఇక ఫ్యూచర్ లో కూడా ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చినా దగ్గరలో ఉన్న పండగకి కానుకగా సినిమా రిలీజ్ చేస్తాడేమో అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.