కెమెరా కోసమే పుట్టిన నటుడు NTR – త్రివిక్రమ్

Monday,October 15,2018 - 04:02 by Z_CLU

టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది NTR అరవింద సమేత. వరస వసూళ్లతో పండగ సీజన్ కి మరింత గ్రాండియర్ ని ఆడ్ చేసిన ఈ సినిమా, రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో NTR గురించి మాట్లాడాడు దర్శకుడు త్రివిక్రమ్.

“కెమెరా కోసం పుట్టిన నటుడు NTR. ఎంత గొప్ప సీన్ అయినా నిమిషాల్లో చేసేస్తాడు. అందుకే ఆ మహానటుడు NTR తరవాత మళ్ళీ అంత స్థాయి ఉన్న నటుడు ఈ NTR. ఒక సీన్ జరిగేటప్పుడు ఆ పాత్రలో ఉండిపోవడం, ఆ సీన్ లో ఉండిపోవడం, అక్కడే ఉంది పోవడం, అది చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణం NTR లో పుష్కలంగా ఉంది. అది ఆయనకు దేవుడిచ్చిన వరం.” అని NTR గురించి చెప్పుకున్నాడు త్రివిక్రమ్.

NTR గురించి మాట్లాడుతూ “ఆయనకున్న సత్తాకి NTR చాలా హైట్స్ కి రీచ్ అవుతాడు, అంత సమర్థత ఉన్న నటుడాయన. దానికి మనం చేయాల్సిందేమీ లేదు. ఆయన ఎదుగుదలను చూస్తూ చప్పట్లు కొడితే చాలు..” అని NTR పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.